Tanuku: రేలంగి ఇందిరానగర్‌లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి ఇందిరానగర్ వాసులు

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం రేలంగి ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సామాజిక శంఖారావం బృందం డిమాండ్ చేసింది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 9 Aug 2026 8:17 PM IST
Tanuku
X

Tanuku: రేలంగి ఇందిరానగర్‌లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి ఇందిరానగర్ వాసులు

తణుకు: ఇందిరా నగర్లో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని సామాజిక శంఖారావం బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రేలంగి గ్రామం ఇందిరానగర్ కాలనీలో బృందం పర్యటించి అక్కడ సమస్యలను గుర్తించారు.

ఇందిరానగర్లో పేదలు నివాసం ఉన్నారని వీరికి డ్రైనేజీలు క్లీనింగ్, సానిటరీ నిర్వాహాణ జరగడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని బృందం నాయకులు తెలిపారు. డ్రైనేజీ క్లీనింగ్ చేయకపోవడం వల్ల చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వ్యాపించి దోమలు విధులుంబించి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిపారు ఇక్కడ మంచినీరు కలుషితం అవడం వల్ల నీళ్ళు త్రాగడానికి భయపడుతున్నారని పైపులైన్లు లీకేజీ ఉన్న ప్రాంతాల్లో రిపేర్లు చేసి సురక్షిత తాగునీటిని అందించాలని ప్రజలు కోరారు.

స్థానిక పంచాయతీ అధికారులు వెంటనే శానిటరీ డ్రైనేజీ, తాగునీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందుపర్తి సత్యనారాయణ నీలాపు ఆంజనేయులు కామన మునిస్వామి పుణ్యావంతుల సత్యనారాయణ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story