Penugonda: మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి క్రీడలు దివ్య ఔషధం: అప్పారావు!

Penugonda: పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో స్వచ్ఛ యువ వికసిత భారత్ ఆధ్వర్యంలో శనివారం క్రీడా పోటీలు జరిగాయి. క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధమని ప్రిన్సిపాల్ అన్నారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 14 Nov 2026 9:04 PM IST
Penugonda
X

Penugonda: మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి క్రీడలు దివ్య ఔషధం: అప్పారావు!

పెనుగొండ: స్వచ్ఛ యువ వికసిత భారత్ మరియు క్రీడా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో బాలుర మరియు బాలికల విభాగాలకు కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షాట్ పుట్, మరియు 200 మీటర్స్ పరుగు పందాలు ప్రయోగాత్మకంగా క్లస్టర్ ఆఫ్ బ్లాక్స్ స్పోర్ట్స్ మీట్ నినాదంతో ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.వి.అప్పారావు తెలియజేశారు.

స్థానిక ఎస్వికెపి డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన క్రీడల్లో తమ విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో క్రీడల్లో పాల్గొని వికసిత్భారత్ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేశారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 200 మీటర్స్ పరుగు, షాట్ పుట్ ట్యాగ్ ఆఫ్ వార్, కబడ్డీ, పోటీలకు గాను 60 మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర సౌష్టవానికి దివ్య ఔషధంగా ఉంటాయని వ్యాఖ్యానించారు.

తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ఎప్పుడూ ముందంజలో ఉంటామని విద్యార్థిని విద్యార్థులు అందరూ కళాశాలలో ఉన్న అన్ని వసతులను సంపూర్ణంగా ఉపయోగించుకుని జీవితాలలో అత్యధిక శిఖరాలను అధిరోహించి కళాశాలకు తమ కుటుంబాలకు భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని కోరారు. అనంతరం గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి. బాపిరెడ్డి , ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు టి.దివాకర్ ఆర్ ఎస్. శ్రీనివాస్ పి.మీరయ్య ప్లేస్మెంట్ ఆఫీసర్ సిహెచ్. శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA