Penugonda: సిపి & పి హెచ్ పి అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్
Penugonda: పెనుగొండ మండల కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పలివెల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Penugonda: సిపి & పి హెచ్ పి అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్
Penugonda: పెనుగొండ మండలంలోని పెనుగొండ టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో పెనుగొండ మండల యూనిట్ ఉపాధ్యక్షుడిగా పలివేల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ప్రజా ప్రతినిధులు, సామాజికవేత్తలు, పలు స్వచ్ఛంద సంస్థల అధినేతలు, దళిత క్రైస్తవ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక సేవతోపాటు, అట్టడుగు వర్గాలకి వైద్య సహాయం అందించడంలో ముందుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం అని పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల యూనిట్ పీహెచ్పీలు, ఒమేగా హాస్పిటల్ భీమవరం రేడియాలజిస్ట్ డాక్టర్ ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర, జిల్లా సిపి & పి హెచ్ పి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు,జి.శ్రీకాంత్, పీహెచ్పీ లో పాల్గొన్నారు.




