Tanuku: తణుకు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ!

Tanuku: తణుకు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఆరిమెల్లి శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరణ. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని వెల్లడి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 24 Sept 2026 4:44 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ!

Tanuku: తణుకు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఆరిమెల్లి శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. భీమవరం జిల్లా సహకార అధికారిగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీల పదవీకాలం ఈనెల 23 తో ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మండల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా వ్యవహారాలు, ప్రజలకు అందుతున్న సేవలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)