Narasapuram: పెదమైనవాని లంకలో 39 మందికి ఉపాధి పరికరాల పంపిణీ చేసిన కేంద్ర మంత్రి!
Narasapuram: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవాని లంకలో 39 మంది లబ్ధిదారులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఉపాధి పరికరాలు అందజేశారు.
Narasapuram: పెదమైనవాని లంకలో 39 మందికి ఉపాధి పరికరాల పంపిణీ చేసిన కేంద్ర మంత్రి!
Narasapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవాని లంకలో ఎస్బీఐ సీఎస్ఆర్ నిధులతో 39 మంది లబ్ధిదారులకు ఉపాధి పరికరాలు పంపిణీ చేశారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఏడు ఆటోలు, 12 మోపెడ్లు, 20 పడవలు, వలలను అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ గ్రామంలోని మరింత మంది అర్హులకు సబ్సిడీపై ఉపాధి పరికరాలు అందించేలా త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు టిడిపి సీనియర్ నాయకులు కొవ్వలి రామ్మోహన్ నాయుడు, పేరాల మోహన్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, బిజెపి జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి.




