Tanuku: తణుకు ఎంపీడీవోగా జీ. శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ!
Tanuku: తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (MPDO) జీ. శ్రీనివాసరావు పదవీ బాధ్యతల స్వీకరణ.
Tanuku: తణుకు ఎంపీడీవోగా జీ. శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ!
Tanuku: తణుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా G శ్రీనివాసరావు శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటివరకు ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలము ఎ.ఓ గా పనిచేసి పదోన్నతిపై పై తణుకు MPDO గా బదిలీ పై వచ్చియున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నివారణకు చర్యలు చేపడతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయిలో తాగునీరు అందిస్తామని చెప్పారు.
ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. అదేవిధంగా పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.
Next Story




