Lankalakoderu: లంకలకోడేరు పీహెచ్‌సీలో రాష్ట్ర వైద్య బృందం పరిశీలన
Lankalakoderu: గర్భాశయ క్యాన్సర్ నివారణకు 14ఏళ్ల లోపు బాలికలకు అందిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ విధానాన్ని పీహెచ్‌సీలో రాష్ట్రస్థాయి బృందం పరిశీలించింది.
Lankalakoderu: లంకలకోడేరు పీహెచ్‌సీలో రాష్ట్ర వైద్య బృందం పరిశీలన
Lankalakoderu: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారి నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఉపయోగపడే హెచ్ పి వి వ్యాక్సిన్ పంపిణీ విధానాలను పరిశీలించుటకు రాష్ట్రస్థాయి బృందం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. రాష్ట్ర హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శృతి. జిల్లా ఇమ్యునైజేషన్ టెక్నికల్ అధికారి సోమిత్ వ్యాక్సిన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శృతి మాట్లాడుతూ 14 ఏళ్ల లోపు బాలికలకు ఈ హెచ్ పి వి వ్యాక్సిన్ వేయడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుండి రక్షింపబడతారని. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు.పిహెచ్ సి లలో వ్యాక్సిన్ అందించే విధానంలో పలు సూచనలు సలహాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.నవ్య జీవన్.డాక్టర్ జి దినేష్.ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు. పి హెచ్ ఎన్ పి. ఎలిజిబెత్.ఫార్మసీ అధికారి పీవీ స్వామి.సూపర్వైజర్లు ఎస్కే అమలేశ్వర రావు. గంగాభవాని, స్టాఫ్ నర్స్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.




