Polavaram: ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలి!

Polavaram: పోలవరం జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమాల నిర్వహణపై 12 మండలాల అధికారులతో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు,

Prasanna, Rampachodavaram
Published on: 14 July 2026 11:18 PM IST
Polavaram
X

Polavaram: ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు పక్కాగా జరగాలి!

పోలవరం: పోలవరం జిల్లాలో ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు పేర్కొన్నారు.

మంగళవారం సాయంకాలం స్థానిక ఐటిడిఏ సమావేశపు హాల్లో పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ పక్కాగా నిర్వహించేందుకు 12 మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, పంచాయతీ కార్యదర్శులతో, గృహ నిర్మాణ శాఖ అధికారులతో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి నర్సింగరావు, ఆర్డబ్ల్యుసి ఇంజనీర్ సుబ్బారావు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని. కమ్యూనిటీ మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ఆయన అన్నారు.

మంజూరైన మరుగుదొడ్లు ప్రతి మండలంలోని గ్రామాలలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అన్నారు. కమ్యూనిటీ మరుగుదొడ్లు అంగన్వాడి కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేయుటకు ఎక్కడెక్కడ కావాలో గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆయన అన్నారు. ప్రతి ఇంట్లో కూరగాయలు, వివిధ పండ్ల మొక్కలు పెంచే విధంగా ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలో బహిరంగ మల విసర్జన చేయకుండా ప్రతి ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

పోలవరం జిల్లాలోని ప్రతి గ్రామంలో చెత్త కుప్పలు తొలగించి పారిశుధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలోని మంజూరైన గృహాలు వేగవంతంగా సకాలంలో పూర్తిచేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో త్రాగునీరు అందించే బాధ్యత గ్రామీణ నీటిపారుదల శాఖ పై ఉందని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో హౌసింగ్ ఈ ఈ రవికుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి సత్యనారాయణమూర్తి, ఎంపీడీవోలు ప్రసాద్,యస్. శ్రీనివాసరావు, నరసింహారావు, సాల్మన్ రాజ్, యం. కుమారి, లక్ష్మణరావు, డిప్యూటీ ఎంపీడీవో హరిబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story