Palakollu: డా. చవాకుల సూర్య నరేష్ బాబుకు కళా సేవ పురస్కారం

Palakollu: తాడేపల్లిగూడెం బి.వి.ఆర్ కళా కేంద్రంలో డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబుకు ఆయన చేసిన సేవలను గుర్తించి కళా సేవ పురస్కారం అందజేశారు.

S VENKAT, PALAKOLLU
Published on: 5 Oct 2026 10:52 PM IST
Palakollu
X

Palakollu: డా. చవాకుల సూర్య నరేష్ బాబుకు కళా సేవ పురస్కారం

పాలకొల్లు: తాడేపల్లిగూడెంలోని బి.వి.ఆర్ కళా కేంద్రం నందు నెలవారి సంగీత నృత్య సాహితీ సాంస్కృతిక సమహారం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి చేస్తున్న విశేష సేవలను గుర్తించి ట్రస్ట ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబుకు కళా సేవ పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బి.వి.ఆర్ కళా క్షేత్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు , లయన్ కుదుళ్ళ నారాయణరావు , కుమారి నురుకుర్తి యశస్వి, బిజెపి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ మీడియా ప్రతినిధి నరిసే సోమేశ్వరావు , ఎంఈఓ కె.వి రామకృష్ణ , వంగా నరసింహారావు , గుండా రామకృష్ణ ,చవాకుల సత్యనారాయణ మూర్తి , తాళాబత్తుల వెంకటేశ్వరరావు , పెచ్చెట్టి ఫణి సింహ , రాయి సూరిబాబు ధోని సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU