Tanuku: ఉండ్రాజవరం జంక్షన్‌లో ₹1.74 కోట్లతో సర్వీసు రోడ్లు: ఎమ్మెల్యే ఆరిమిల్లి
Tanuku: తణుకు ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి NHAI రూ.1.74 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
Tanuku: ఉండ్రాజవరం జంక్షన్‌లో ₹1.74 కోట్లతో సర్వీసు రోడ్లు: ఎమ్మెల్యే ఆరిమిల్లి
Tanuku: తణుకు పట్టణ పరిధి ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రూ.1.74 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
ఈ మేరకు సర్వీస్ రోడ్లను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని,త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోవడంతో ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు అద్వానంగా మారడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుంతలు, దెబ్బతిన్న రోడ్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరగడంతో ఈ సమస్యపై ఎమ్మెల్యే రాధాకృష్ణ గతంలోనే హైవే నిర్వహణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్ల దుస్థితిని అసెంబ్లీలోనూ ప్రస్తావించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో స్పందించిన హైవే నిర్వహణ అధికారులు సర్వీసు రోడ్ల నిర్మాణానికి రూ.1.74 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.




