Tanuku: నాలుగు రోజులైనా ముంపులోనే తణుకు అభయ ఆంజనేయ నగర్
Tanuku: మురసు తుపాను వర్షాలతో నాలుగు రోజులైనా వీడని ముంపు నీరు. తణుకు 1వ వార్డు అభయ ఆంజనేయ నగర్‌లో మోకాళ్ల లోతు నీటిలో చిక్కుకుని నరకయాతన పడుతున్న స్థానికులు.
Tanuku: నాలుగు రోజులైనా ముంపులోనే తణుకు అభయ ఆంజనేయ నగర్
తణుకు: మురసు తుపాను ప్రభావంతో భారీ వర్షాల కారణంగా నాలుగు రోజులైనా తణుకు పట్టణం ముంపు నుంచి తేరుకోలేదు. పురపాలక సంఘ పరిధి ఒకటో వార్డు అభయ ఆంజనేయ నగర్ లో మోకాళ్ళ లోతు నీటిలో స్థానికులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇళ్లలోకి సైతం ముంపు నీరు చేరడంతో స్థానికులు బయటకు నడిచి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
దీనికి తోడు మట్టి, కంకర రహదారులు కావడంతో ద్విచక్ర వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం నడిచి వెళ్లడానికి కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్థానికులు ఇళ్లలోనే మగ్గుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లి విద్యార్థులు, ఆస్పత్రికి వెళ్లే వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది ఇలా ఉంటే వీధి శునకాలు, పిల్లులు నీటి నుంచి బయటకు రాలేక చనిపోవడంతో విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల అంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.




