Tanuku: తణుకు మండలం వేల్పూరులో బీఎస్పీ అభ్యర్థి సంచలన విజయం!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో బీఎస్పీ విజయకేతనం. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్వగ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకున్న బీఎస్పీ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 8 Nov 2026 1:00 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మండలం వేల్పూరులో బీఎస్పీ అభ్యర్థి సంచలన విజయం!

Tanuku: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్వగ్రామం వేల్పూరులో 6 ఎంపీటీసీ స్థానాలకు గాను, కూటమి ప్రభుత్వం మూడు స్థానాలను ఏకగ్రీవం చేసింది. రెండు ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా పోటీ ఇవ్వగా, ఎంపీటీసీ 5 లో మాత్రం కూటమి అభ్యర్థి పోటీలో లేకపోవడంతో వైకాపా, బీఎస్పీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. హోరాహోరీ పోటీలో అన్యుహంగా బీఎస్పీ అభ్యర్థి మేడిద ఆనందరావు విజయం సాధించారు. ఇదే పోలింగ్ కేంద్రంలో

ఎమ్మెల్యే ఆరిమిల్లి తన ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ బీఎస్పీ అభ్యర్థి ఆనందరావుకు డిక్లరేషన్ పత్రం అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆనందరావు పేర్కొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)