Tanuku: దళితవాడల సమస్యలపై ఈనెల 24న ‘చలో కలెక్టరేట్’ కేవీపీఎస్!
Tanuku: దళితవాడల్లో సమస్యలపై ఈనెల 24న చలో కలెక్టరేట్. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దిరెడ్డిపాలెంలో కరపత్రాల ప్రచారం.
Tanuku: దళితవాడల సమస్యలపై ఈనెల 24న ‘చలో కలెక్టరేట్’ కేవీపీఎస్!
Tanuku: దళిత వాడల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 24 న నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే. క్రాంతిబాబు కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం పేరుతో దళితుల సమస్యలపై గత 30 రోజులుగా జిల్లాలో దళితుల సమస్యలపై సర్వే చేసి గుర్తించిన సమస్యలపై దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరు కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ రఘువరన్ మండలం పెద్దిరెడ్డిపాలెంలో కరపత్రం ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా క్రాంతిబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 79 సంవత్సరాలు పూర్తయిన దళితుల జీవితాలు మారలేదన్నారు. దళిత పేటలో కనీస సౌకర్యాలు,స్మశాన వాటికలు లేక రోడ్లు పక్కన సమాధులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వివి గోపాలం మాట్లాడుతూ కులాంతర వివాహాలు చేసుకునేవారికి ప్రభుత్వాలు రక్షణ కల్పించట్లేదని,జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చేయడం లేదని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి దళితపేటల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటిని అమలు చేసే వరకు దళిత ఐక్య ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కామన మునిస్వామి, బి. బాలయ్య,టీ.రాముడు, తామరపల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.




