Tanuku: తణుకు కోర్టులో మొక్కలు నాటిన న్యాయమూర్తులు!

Tanuku: తణుకు కోర్టు భవనాల సముదాయంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం. ప్లాస్టిక్ నిషేధించాలని కోరిన జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 14 July 2026 11:50 AM IST
Tanuku
X

Tanuku: తణుకు కోర్టులో మొక్కలు నాటిన న్యాయమూర్తులు!

Tanuku: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆధ్వర్యములో తణుకు కోర్టు భవనముల సముదాయములో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి , ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని న్యాయమూర్తి శ్రీదేవి కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి K కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి G స్వర్ణ, రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ K కృష్ణ వేణి, సీనియర్ న్యాయవాదులు D రాధమ్మ, VSRD దీక్షితులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు క్రాంతి ప్రసాద్, కౌర్ వెంకటేశ్వర్లు, బింకం రవి కుమార్, Sk బాజీ, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story