Tanuku: తణుకు జిల్లా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Tanuku: తణుకు జిల్లా ఆసుపత్రిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బాధితురాలికి విజయవంతంగా ఆపరేషన్. వైద్యుల బృందాన్ని అభినందించిన నియోజకవర్గ ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 28 Sept 2026 11:33 PM IST
Tanuku
X

Tanuku: తణుకు జిల్లా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

తణుకు: తణుకు జిల్లా ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్న ఒక మహిళకు అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రాణాపాయం నుంచి కాపాడటం అభినందనీయమని నియోజకవర్గ ప్రత్యేక అధికారి కేవీవీ సత్యనారాయణ అన్నారు.

ఈ నెల 19న 34 ఏళ్ల ఓ మహిళ తీవ్ర రక్తస్రావంతో జిల్లా ఆసుపత్రికి వచ్చింది. బాధితురాలికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమె గర్భాశయం వెలుపల అండాశయ నాళంలో గర్భం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) దాల్చినట్లు గుర్తించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే అత్యవసర వైద్య చికిత్స ప్రారంభించి, అవసరమైన పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేపట్టారు.

డాక్టర్ ఎస్. గాయత్రి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరాజు నేతృత్వంలోని వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి పరిమిత వనరులతోనే ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ సందర్బంగా అయన వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్, డాక్టర్ సాయిబాలాజీ, తణుకు ఎంపీడీవో ఎం. శ్రీనివాసరావు, యంగ్ ప్రొఫెషనల్ మహేంద్ర, విజన్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)