Tanuku: తుపాను ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యల పరిశీలన!

Tanuku: తణుకు జడ్పీ బాలుర పాఠశాల పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ పరిమి వెంకన్నబాబు. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 28 Oct 2026 8:28 PM IST
Tanuku
X

Tanuku: తుపాను ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యల పరిశీలన!

తణుకు: అర్నబ్ తుఫాన్ ప్రభావ ప్రాంతాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు అన్నారు.

తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించి అక్కడ ఏర్పాట్లు, భోజన వసతుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.

శిబిరంలో ఉన్న చిన్న పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. అనంతరం స్థానిక 13 వార్డులో తుఫాన్ తాకిడికి కూలిన చెట్లను తొలగించే పక్రియను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేతలు చింతలపూడి సన్యాసిరావు, మాదాసు సూరిబాబు, అబ్బుదాసరీ లాజర్, పంపన నాగపద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)