Tanuku: తణుకులో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై పోటీలు
Tanuku: తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వక్తృత్వ పోటీలు. విద్యార్థులు మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అధికారుల పిలుపు.
Tanuku: తణుకులో విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణపై పోటీలు
తణుకు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "వికసిత భారత్ నిర్మాణంలో నషా ముక్త యువ పాత్ర" అను అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (AES) మద్దాల శ్రీనివాస రావు మాట్లాడుతూ 'స్వర్ణ ఆంధ్రప్రదేశ్' నిర్మాణంలో యువతే కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అటువంటి యువత శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా దృఢంగా ఉండాలంటే అది కేవలం డ్రగ్స్ నిర్మూలన ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు 100 వారాల్లో 100 బలమైన అడుగులు వేయాలనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అధ్యాపకులు కె .రవీంద్ర బాబు, ఐ.వి నారాయణ,ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




