Tanuku: తణుకు ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం!
Tanuku: తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 5 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి తెలిపారు.
Tanuku: తణుకు ఎక్సైజ్ పరిధిలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం!
Tanuku: తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన 5 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కొరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. పెనుగొండలో మూడు, పెనుమంట్రలో రెండు షాపులు ఉన్నాయని, ఆసక్తి గల వ్యక్తులు వచ్చే నెల ఒకటో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 3న దరఖాస్తుల పరిశీలన, 5న భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా డ్రా తీస్తారని వెల్లడించారు.
దరఖాస్తు రుసుము నాన్-రిఫండబుల్ రూ. 3 లక్షలు, నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. డ్రాలో గెలుపొందిన విజేతలు చెల్లించవలసిన వార్షిక ఫీజు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ రూ. 71,50,000 దీనిని నాలుగు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పర్మిట్ రూమ్ ఫీజు రూ. 7,50,000 (దీనిని మూడు వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుందని) వెల్లడించారు. మరిన్ని వివరాలు, నియమ నిబంధనల కొరకు తణుకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 9490874538 నంబర్ ను సంప్రదించాలని మణికంఠ రెడ్డి తెలిపారు .




