Tanuku: తణుకులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పరిమి వెంకన్న బాబు

Tanuku: మురసు తుఫాన్ ప్రభావంతో తణుకులో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించిన మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్న బాబు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 4 Nov 2026 10:23 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పరిమి వెంకన్న బాబు

తణుకు: మురసు తుఫాన్ ప్రభావంతో ముంపుకు గురైన ప్రాంతాలను మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్న బాబు బుధవారం తణుకు పట్టణంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో బాధితులకు సత్పర న్యాయం చేసేలా అధికారులను సమన్వయం చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా నాయకులు అబ్బ దాసరి లాజర్, చింతలపూడి సన్యాసిరావు రామదాసు సూర్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)