Tanuku: తణుకులో తుఫాను బాధితులకు ఉచిత నిత్యావసరాల పంపిణీ

Tanuku: తణుకు కొండాలమ్మ పుంత రోడ్డు నిరుపేదలకు జిఎన్ఆర్ శంకర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ. పాల్గొన్న బిజెపి నాయకులు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 9 Nov 2026 8:53 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో తుఫాను బాధితులకు ఉచిత నిత్యావసరాల పంపిణీ

తణుకు: తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవాలని జిఎన్ఆర్ శంకర్ సేవా ట్రస్ట్ చైర్మన్ గురుజుకోట రాకేష్ బాబు పేర్కొన్నారు.

తుపాను కారణంగా కనీస వసతులు లేక అవస్థలు పడుతున్న తణుకు కొండాలమ్మ పుంత రోడ్డు పక్కన నివసిస్తున్న నిరుపేదలకు జిఎన్ఆర్ శంకర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాజపా తణుకు అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, మురళీకృష్ణ, చింతపల్లి రాజు, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)