Tanuku: న్యాయ వ్యవస్థను న్యాయవాదులు కాపాడుకోవాలి దిగుపాటి
Tanuku: తణుకులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మహాసభలో మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ వ్యాఖ్యలు. న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలని డిమాండ్.
Tanuku: న్యాయ వ్యవస్థను న్యాయవాదులు కాపాడుకోవాలి దిగుపాటి
తణుకు: న్యాయ వ్యవస్థను న్యాయవాదులే కాపాడుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు దిగుపాటి రాజగోపాల్ అన్నారు. తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాది నేతల సోమేశ్వరరావు ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తణుకు యూనిట్ ఐదో మహాసభ శుక్రవారం కౌరు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై దాడులు పెరిగాయని వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాటంలో ముందుండి పోరాడిన న్యాయవాదులు నేడు న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
న్యాయవ్యవస్థ ప్రజల జీవితాలకు దిక్సూచి లాంటిదని ప్రజల జీవన విధానముకు అనుగుణంగా పరిపాలన సాగే విధంగా న్యాయ వ్యవస్థ చూస్తుందని అన్నారు. చట్టాల అమలులో కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు తెలిపారు.
కానీ నేడు పాలకులే న్యాయ వ్యవస్థను శాసించేలాగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం చట్టం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విజయవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్
నిర్వహిస్తుందని న్యాయవాదులందరూ అండగా ఉండాలని కోరారు. తోలుత మహాసభ నేతల సోమేశ్వరరావు మూర్తి మృతికి సంతాపం తెలిపింది. మహాసభలో జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు న్యాయమిత్ర ద్వారా ఇచ్చి, న్యాయవాదులదరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, న్యాయవాదుల వృత్తి రక్షణ చట్టాన్ని తీసుకురావాలని సమావేశం మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ మహాసభలో ఆల్ ఇండియా లాస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కామన మునిస్వామి, న్యాయవాదులు అడ్డాల బాబ్జి, వెలగల సాయిబాబా రెడ్డి,షేక్మోతి, జి.అంబేద్కర్, చోడే గోపికృష్ణ, టీ. కోటేశ్వరరావు, జుత్తిగ చంద్ర ప్రసాద్, ఏలూరి మోషి, రాపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




