Tanuku: న్యాయవాదుల విజయవాడ మహాధర్నాను జయప్రదం చేయాలి AILU
Tanuku: విజయవాడ న్యాయవాదుల మహాధర్నా జయప్రదం చేయాలని తణుకులో AILU పిలుపు. స్టైపండ్ పెంపు, హెల్త్ కార్డ్‌ల మంజూరుపై కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్.
Tanuku: న్యాయవాదుల విజయవాడ మహాధర్నాను జయప్రదం చేయాలి AILU
తణుకు: న్యాయవాదుల మహాధర్నాన్ని జయప్రదం చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం బార్ అసోసియేషన్ ఆవరణలో ఆగస్టు ఒకటో తేదీన విజయవాడలో జరిగే న్యాయవాదుల మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్
యూనియన్ ఆధ్వర్యంలో నినాదాలు చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం ఎన్నికల ముందు న్యాయవాదులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో 40 వేల మంది తమ వృత్తిని చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయాలని అన్నారు.
కూటమి ప్రభుత్వం న్యాయవాదులకు న్యాయమిత్ర ద్వారా ఇచ్చే స్టైపండు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచే హామీనీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏట న్యాయవాదులు కోర్టు ఫీజు రూపంలో లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారని అయినా న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం విచారకరమని అన్నారు.
న్యాయవాదులు వృత్తి చేసేటప్పుడు అదేవిధంగా న్యాయవాదులపై ఒత్తిళ్లు పెరగడం వల్ల అనారోగ్యాల గురవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారని, వారికి వైద్య ఖర్చులు నిమిత్తం ప్రభుత్వమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు బార్ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి బింకం రవికుమార్ న్యాయవాదులు వెన్నపు సుధాకర్,టీ. నెహ్రు రాపాక ప్రభాకర్ నేతుల విజయ శేఖర్ వేపూరి వెంకటకృష్ణ మల్లిపూడి సువర్ణరాజు వి .సత్యసాయి, యు .మణికంఠ తదితరులు పాల్గొన్నారు.




