Tanuku: తణుకులో 200 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ!

Tanuku: తణుకులో శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 200 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 13 Sept 2026 9:32 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో 200 మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ!

తణుకు: తణుకులో శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. నరేంద్ర సెంటర్‌లోని రమేష్ జ్యుయలర్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దామర రంగారావు, ఫస్ట్ వైస్ గవర్నర్ స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరై లయన్స్ క్లబ్ సేవలను అభినందించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ సరళాదేవి సూచించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎన్.వి. రామ్ కుమార్, వావిలాల పవన్ కుమార్, వావిలాల వెంకట రమేష్, రమేష్ గుప్తా, ఆకురాతి శ్రీనివాస్, బత్తుల రమణ, బి. శివ, ఎన్. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)