Tanuku: తణుకులో రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్

Tanuku: ‘ఇరుముడి’ సినిమా రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సందర్భంగా తణుకు ప్రత్యూష థియేటర్‌లో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Updated on: 26 Aug 2026 11:38 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో రవితేజ ‘ఇరుముడి’ సినిమా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్

తణుకు: మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సందర్భంగా తణుకులో బుధవారం రాత్రి అభిమానులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. తణుకు ప్రత్యూష థియేటర్‌లో కేక్ కట్ చేసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వేడుకలకు మొగల్తూరు గ్రామానికి చెందిన మాస్ మహారాజా జూనియర్ రవితేజ, జూనియర్ మనెమ్మ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. రవితేజ తణుకు టౌన్ వైడ్ ప్రెసిడెంట్ గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇరుముడి కుటుంబ కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, తండ్రి–కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అభిమానులు తెలిపారు. రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూ సినిమా రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. రవితేజ విలక్షణ నటుడని, ఆయన అభిమానులుగా ముందుకు సాగడం తమకు గర్వకారణమని అన్నారు.

ఇటీవల విడుదలైన చిత్రాలతో పోలిస్తే ఇరుముడికు వస్తున్న ఆదరణ తమను ఎంతో ఆనందపరుస్తోందని, సినిమా ఇండస్ట్రీలో మంచి చిత్రాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిమానులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రవితేజ తణుకు టౌన్ వైడ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story