Tanuku: తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఘనంగా సాహిత్య సభ!

Tanuku: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో సాహిత్య సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ గేయ రచయిత రసరాజు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Nov 2026 11:40 AM IST
Tanuku
X

Tanuku: తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో ఘనంగా సాహిత్య సభ!

తణుకు: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పురుషులు శాఖ గ్రంధాలయంలో సాహితీవేత్తల సాహిత్య సభను గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ గేయ రచయిత రసరాజు మాట్లాడుతూ సాహితీ సభలను తణుకులో ప్రతినెలా నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం రసరాజును జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కౌరు వెంకటేశ్వర్లు,కార్యదర్శి కలగ రామకుమార్, సాహితీవేత్తలు తాడినాడ భాస్కర్, వేల్పూరు సత్య,షణ్ముఖ విజయకుమార్, సత్యనారాయణ, ఆర్విఎస్ ప్రసాద్,ఆర్కెస్ట్రా రాజు, పోప్పోల లక్ష్మి ,జవ్వాది లక్ష్మి ,యం జ్యోతి, ఎస్ దొరబాబు, ఎమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)