Tanuku: తణుకులో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Tanuku: తణుకు మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ. పాల్గొన్న అధికారులు, నాయకులు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 15 Aug 2026 7:22 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తణుకు: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తణుకు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా పార్టీల కార్యాలయాలు, విద్యాసంస్థలు వద్ద జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమెల్లి రాధాకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి, ఆధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.

గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజల భాగస్వామ్యంతో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రాంకుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్న బాబు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, రేరా సభ్యుడు మంత్రి రావు వెంకటరత్నం, పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story