Tanuku: తణుకులో ఐదు తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం
Tanuku: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు నూతన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.
Tanuku: తణుకులో ఐదు తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం
తణుకు: ప్రతి తల్లి.. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఐదు నూతన వాహనాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సురక్షితమైన, వేగవంతమైన ఉచిత రవాణా సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ఆశయమన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు పరిమి వెంకన్న బాబు, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఆసుపత్రి సూపరిటిండెంట్ డాక్టర్ సాయి కిరణ్, ఆస్పత్రి ఆర్ఐ ఓ సాయి బాలాజీ, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




