Tanuku: తణుకులో కూటమి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

Tanuku: తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 18 Oct 2026 11:24 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో కూటమి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

తణుకు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న ఏర్పాట్లు, కూటమి అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆదివారం సమీక్ష నిర్వహించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, కూటమి అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు.ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చురుగ్గా పని చేయాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాలను చేరవేయాలని సూచించారు.

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో తణుకు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)