Tanuku: నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వైసీపీ అభ్యర్థి బలరాం!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైసీపీ నేత యిండుగపల్లి బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 16 Nov 2026 12:08 PM IST
Tanuku
X

Tanuku: నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా వైసీపీ అభ్యర్థి బలరాం!

తణుకు: తణుకు మున్సిపల్ చైర్మన్ యిండుగపల్లి బలరామకృష్ణ నామినేషన్ దాతలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. తొలుత స్థానిక వైకాపా పార్టీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి రోడ్డు నరేంద్ర కూడలి మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్టణ ప్రజలు తమకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా జై కారుమూరి జై జై కారుమూరి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కొట్టు నాగేంద్ర, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)