Tanuku: తణుకులో అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.
Tanuku: తణుకులో అంతర్రాష్ట్ర బైక్ దొంగను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. లక్షల విలువైన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
Tanuku: తణుకులో అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.
Tanuku: అంతర్ రాష్ట్ర బైక్ దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలను తణుకు పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ జె వెంకటరమణ వివరాలను వెల్లడించారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రావు ది ద్విచక్ర వాహనం అపహరణకు గురైంది.
దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తణుకు టిడ్కో గృహాల వద్ద అనుమానంగా తిరుగుతున్న ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన వీసా సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్ర వాహనాలను అపహరించుకుపోయినట్లు అంగీకరించాడు.
దీంతోసురేష్ ను ఈ నెల 8న అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టుకు హాజరు పరిచినట్లు వెల్లడించారు. చోరీ చేసిన వాహనాలు తణుకు పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బచ్చుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనివని తెలిపారు.
నిందితుడు పార్కింగ్ ప్రదేశాలు, బార్లు రెస్టారెంట్లు వద్ద నిలిపిన వాహనాలను ఎంపిక చేసుకుని వాటికి మారు తాళాలు పెట్టి వాహనాలను అపహరించకపోయి టిడ్కో గృహాల సమీపంలో దాచినట్లు తెలిపారు. నిందితుడి అరెస్టులో ప్రతిభ చూపిన ఎస్సై సిహెచ్ వి సత్యనారాయణ, సిబ్బంది ఎం సత్యనారాయణ టివి రవి , షేక్ అక్బర్ లాల్ డి వెలగేశ్వరరావు ఎంపి వి శివాజీ లను జిల్లా ఉన్న అధికారులు అభినందించారు.




