Tanuku: కొమరవరం హత్య కేసు నిందితురాలికి 14 రోజులు రిమాండ్

Tanuku: తణుకు మండలం కొమరవరం గ్రామంలో పాలా నాగరాజు హత్య కేసులో నిందితురాలు శిరీష అరెస్ట్. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వెల్లడి.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 2 Nov 2026 9:00 PM IST
Tanuku
X

Tanuku: కొమరవరం హత్య కేసు నిందితురాలికి 14 రోజులు రిమాండ్

తణుకు: తణుకు మండలం కొమరవరం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు గ్రామీణ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. గ్రామానికి చెందిన పాలా నాగరాజు (44) అదే గ్రామానికి చెందిన పాలా శిరీషల మధ్య అంతర్గత కలహాల నేపథ్యంలో గత నెల 30న శిరీష చాకుతో నాగరాజుపై దాడి చేసింది.

ఈ క్రమంలో నాగరాజు చేతి మనికట్టు వద్ద తీవ్ర గాయమైంది. దీంతో నాగరాజును స్థానికులు తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తణుకు పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గత నెల 31న నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే.

దీంతో సంఘటన ప్రాంతాన్ని గ్రామీణ సీఐ డి. వెంకటేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలైన శిరీషను అరెస్ట్ చేసి సోమవారం కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై శ్రీనివాసరావు వెల్లడించారు .

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)