West Godavari: మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ డిమాండ్ సిగ్గుచేటు: రాధాదేవి!
West Godavari: మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరిన జడ్పీటీసీ సుభాషిణి వ్యాఖ్యలను పెనుమంట్ర మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు భూపతిరాజు రాధాదేవి తీవ్రంగా ఖండించారు.
West Godavari: మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ డిమాండ్ సిగ్గుచేటు: రాధాదేవి!
West Godavari: మెగా డీఎస్సీ పై సిబిఐ విచారణ జరిపించాలని జడ్పిటిసి కర్రీ గౌరీ సుభాషిని డిమాండ్ చేయడానికి తీవ్రంగా ఖండించిన పెనుమంట్ర మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు .భూపతి రాజు రాధా దేవి. డీఎస్సీ అంటేనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మార్క్ అని ఆయన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే నాలుగు డీఎస్సీలు ఎంతో పారదర్శకంగా నిర్వహించి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా ఎంతోమంది టీచర్ ఉద్యోగాలు పొందడం జరిగిందని.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన డీఎస్సీలో పనిచేస్తున్న టీచర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో ఆనందంగా ఉన్నారని తెలియజేసిన పెనుమంట్ర మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు. భూపతి రాజు రాధా దేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహించి 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పిస్తే, వారందరూ ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే కావాలని టీచర్స్ అందరిని ఆనందంలో ఉండకుండా, అయోమయంలో ఉండాలని, కావాలని డీఎస్సీపై సిబిఐ విచారణ జరిపించాలని,
వైయస్సార్ పార్టీ వారు డిమాండ్ చేయడం సిగ్గుచేటని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమని తెలియజేసిన బహిరంగ చర్చకు మీ నాయకుడు రాకపోవడం మీ తప్పుడు ఆరోపణలకు నిదర్శనమని ఎప్పుడు ఒక డీఎస్సీ కూడా నిర్వహించలేని మీరు డిఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదని వైసిపి నాయకులను సూటిగా ప్రశ్నించిన పెనుమంట్ర మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు భూపతి రాజు రాధా దేవి.




