Eluru: ఏలూరు జిల్లాలో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు..
Eluru: ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో పులి సంచారం కలకలం. అటవీ ప్రాంత గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులు.
Eluru: ఏలూరు జిల్లాలో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన అటవీశాఖ అధికారులు..
ఏలూరు జిల్లా: వెలేరు పాడు మండల సరిహద్దు ప్రాంతానికి ఆనుకొని ఉన్న పోలవరం మండలంలోని తెల్లదిబ్బలు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. సోమవారం అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోలవరం మండలంలోని తెల్లదిబ్బలు ప్రాంతానికి సమీపంలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, కాకిస్నూర్, టేకుపల్లి, కోయిదా, గుల్లమడుగు, టేకూరు, సిద్ధారం గ్రామాల ప్రజలు రాత్రిపూట ఒంటరిగా సంచరించరాదని, పశువులను అడవిలోనికి మేతకు తీసుకువెళ్లకూడదని మరియు పశువుల కొట్టం నందు లైటింగ్ ఏర్పాటు చేసుకుని పశువులను ఇళ్ల వద్దే భద్రంగా ఉంచాలని యజమానులకు సూచించారు.
ఎవరూ కూడా నది పరివాహక ప్రాంతాలలో చేపల వేటకు గాని పశువుల మేతకు తీసుకువెళ్లకూడదని వెళ్ళకూడదనీ, రైతులు, గ్రామస్తులు, పొలాలు, అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.




