Penugonda: పెనుగొండ మండలంలో విషాదం పొలాల్లో కలుపు మందు తాగి ఇద్దరి మృతి
Penugonda: పెనుగొండ మండలం కామదేవుని లంక పొలాల్లో కలుపు మందు తాగిన కిషోర్, తేజశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై గంగాధర్ తెలిపారు.
Penugonda: పెనుగొండ మండలంలో విషాదం పొలాల్లో కలుపు మందు తాగి ఇద్దరి మృతి
పెనుగొండ: పెనుగొండ మండలం కామదేవుని లంక పరిధిలోని పొలాల్లో కలుపు మందు తాగిన ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెనుగొండ ఎస్సై కొప్పిశెట్టి గంగాధర్ తెలిపారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కొండేటి కిషోర్ (31), గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి (36) గతంలో ప్రేమించుకున్నారు.
కులాలు వేరుకావడంతో కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో వేర్వేరు వ్యక్తులను వివాహం చేసుకున్నారు. వివాహాల అనంతరం కూడా వారి మధ్య పరిచయం కొనసాగింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వారిని దూరంగా ఉంచినట్లు పోలీసుల వివరాల్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 10న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇద్దరూ కామదేవుని లంక పొలాల్లో ఉదయం 10.30 గంటలకు కలుపు మందు తాగారు. బంధువుల సమాచారంతో 108 అంబులెన్సులో కిషోర్‌ను తణుకులోని శ్రీకేశవ ఆసుపత్రికి, తేజశ్రీని యాపిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్టోబర్ 11న ఉదయం 10.30 గంటలకు కిషోర్, సాయంత్రం 6.30 గంటలకు తేజశ్రీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.




