Velerupadu: పాము కాటుతో యువకుడు మృతి..
Velerupadu: వేలేరుపాడు మండలంలో పాముకాటుతో యువకుడు మృతి. పాముకాటును గుర్తించడంలో ఆలస్యం జరగడంతో ప్రాణాలు కోల్పోయిన రాజశేఖర్. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన.
Velerupadu: పాము కాటుతో యువకుడు మృతి..
వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మేడేపల్లి పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మడివి రాజశేఖర్ (34), తండ్రి ఎర్రయ్య, బుధవారం మధ్యాహ్నం పాము కాటుకు గురయ్యాడు. అయితే అది పాము కాటు కాదని భావించి నిర్లక్ష్యం చేయడంతో చికిత్స ఆలస్యమైంది. అనంతరం కాలికి తీవ్రంగా వాపు రావడంతో పాటు చర్మం పొరలుగా విడిపోవడం ప్రారంభమైంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే రాజశేఖర్ మృతి చెందాడు.
ఈ ఘటనతో కమ్మరిగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉన్నందున, పాము కాటు అనుమానం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తక్షణ వైద్య చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.




