Tanuku: తణుకులో విజయవంతమైన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
Tanuku: తణుకులో విజయవంతమైన బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని, ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొడతామని యుఎఫ్‌బియు నేతల హెచ్చరిక.
Tanuku: తణుకులో విజయవంతమైన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె!
తణుకు: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె శుక్రవారం తణుకులో విజయవంతంగా జరిగింది. ఉద్యోగులు స్థానిక కెనరా బ్యాంకు వద్ద నిరసన నిర్వహించి, అనంతరం పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, లోకల్ బ్యాంకు కో-ఆర్డినేషన్ కమిటీ నాయకులు వివివి సత్యనారాయణ, ఎ. రవికుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని, వివక్షాపూరిత ప్రోత్సాహక పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాలను కేంద్రం విడనాడాలని, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
సమ్మెకు యుఎఫ్‌బియు నాయకులు కె. శ్రీనివాస్, ఎన్. శివరామరావు, చిన్ని, గోవింద్, రాజా, ఎన్.ఎస్. రామారావు, ఎస్. దుర్గాప్రసాద్, సీఐటీయూ నాయకులు జి. గోపి, గార రంగారావు తదితరులు నాయకత్వం వహించారు.




