Undrajavaram: అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా రాజేశ్వరి
Undrajavaram: నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం కూటమి సర్పంచి అభ్యర్థి సిరిసపల్లి రాజేశ్వరి ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు అభ్యర్థన.
Undrajavaram: అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా రాజేశ్వరి
ఉండ్రాజవరం: అవకాశం ఇవ్వండి.. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని కూటమి సర్పంచి అభ్యర్థి సిరిసపల్లి రాజేశ్వరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం కూటమి సర్పంచి అభ్యర్థి రాజేశ్వరి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన తన లక్ష్యమని చెబుతూ గ్రామంలో పలు ప్రాంతాల్లో తనదైన శైలిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎదురైన లోపాలను ప్రస్తావిస్తూ ఓటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. గ్రామ మాజీ సర్పంచి, తెదేపా సీనియర్ నాయకుడు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు.
తాము బలపరిచిన సర్పంచి అభ్యర్ధి రాజేశ్వరి గుర్తు కత్తెరపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.




