Unguturu: పెద నిండ్రకొలను విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

Unguturu: పెద నిండ్రకొలను ఎంపీపీ స్కూల్‌లో విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు. దాత పచ్చాకుల వాసు సహకారంతో నోటు పుస్తకాల అందజేత.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 14 July 2026 3:36 PM IST
Unguturu
X

Unguturu: పెద నిండ్రకొలను విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

ఉంగుటూరు: ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల–1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పంపిణీతో పాటు, జనసేన పార్టీ నాయకులు శ్రీ పచ్చాకుల వాసు గారి సౌజన్యంతో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న యూనిఫాం, షూస్, స్కూల్ బ్యాగ్ తదితర విద్యా సామగ్రిని, అలాగే దాత సహకారంతో అందించిన నోట్ పుస్తకాలను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించిన దాత శ్రీ పచ్చాకుల వాసు గారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి విద్యనే జీవితంలో విజయానికి పునాదిగా భావించి కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా సామగ్రిని ఉచితంగా అందిస్తోందని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు దాతలు కూడా తోడ్పాటు అందించడం ద్వారా విద్యార్థుల్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి ఎన్డీఏ కూటమి పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వీరమహిళలు, తెలుగు మహిళలు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story