Polasanipalli: గురుకుల పాఠశాలలో నూతన గదులకు శంకుస్థాపన!

Polasanipalli: పోలసానిపల్లి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రూ. కోటితో నూతన తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 19 Aug 2026 12:57 PM IST
Polasanipalli
X

Polasanipalli: గురుకుల పాఠశాలలో నూతన గదులకు శంకుస్థాపన!

Polasanipalli: భీమడోలు మండలం పాలసనపల్లి గ్రామంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో DMFT నిధులు రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన తరగతి గదుల నిర్మాణానికి బుధవారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు గారు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ముఖ్యమని అన్నారు. నూతన తరగతి గదుల నిర్మాణంతో గురుకుల విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

విద్యారంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే ధర్మరాజు గారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చి విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గురుకుల పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story