Unguturu: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’.. శ్రమదానం చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

Unguturu: ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పెద నిండ్రకొలనులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 20 Jun 2026 5:40 PM IST
Unguturu
X

Unguturu: ‘స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’.. శ్రమదానం చేసిన ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు

ఉంగుటూరు: ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామంలో ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు స్థానిక ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రమదానం నిర్వహించి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఇళ్లతో పాటు గ్రామంలోని సామూహిక ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని సూచించారు.

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతోందని, ఈ క్రమంలో స్వచ్ఛ రథాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని అన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story