Unguturu: డీఎస్సీ అక్రమాలపై ఉంగుటూరులో రేపు వైకాపా పోరుబాట!

Unguturu: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీకి పిలుపు.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 10 Aug 2026 12:48 PM IST
Unguturu
X

Unguturu: డీఎస్సీ అక్రమాలపై ఉంగుటూరులో రేపు వైకాపా పోరుబాట!

Unguturu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంగుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారి ఆధ్వర్యంలో రేపు సోమవారం ఉదయం 8:30 గంటలకు భారీ నిరసన ర్యాలీ జరుగును.

ఉంగుటూరు జాతీయ రహదారి (మంగరావు గారి కర్రల మిషన్ )దగ్గర నుండి రాజశేఖరరెడ్డి గారి విగ్రహం వరుకు నిరసన ర్యాలీ జరుగును,కావున ర్యాలీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి నిరుద్యోగ యువత తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.


ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story