Narsapuram: విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే పీఎం సూర్య ఘర్ లక్ష్యం!
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైనవానిలంకలో పీఎం సూర్య ఘర్ యోజన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
Narsapuram: విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే పీఎం సూర్య ఘర్ లక్ష్యం!
Narsapuram: సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడమే పీఎం సూర్య ఘర్ యోజన లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైనవానిలంకలో పీఎం సూర్య ఘర్ యోజన పైలెట్ ప్రాజెక్టును మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్‌తో కలిసి ప్రారంభించారు.
ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని సొంత విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. 2 కిలోవాట్లకు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్రం రూ.20 వేల వరకు సబ్సిడీ అందిస్తోందన్నారు.
750 కుటుంబాలున్న పెద్దమైనవానిలంకలో పథకం పూర్తిస్థాయిలో అమలైతే రూ.6–7 కోట్ల వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి, ఎమ్మెల్యే కోరారు.




