Tanuku: తణుకులో ఇళ్ల పట్టాల విక్రయంలో క్రెడిట్ చోరీ వడ్లూరి సీతారామ్

Tanuku: తణుకు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీలో క్రెడిట్ చోరీ చేస్తూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజలను మోసం చేస్తున్నారని వడ్లూరి సీతారాం ఆరోపించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 12 Oct 2026 8:43 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఇళ్ల పట్టాల విక్రయంలో క్రెడిట్ చోరీ వడ్లూరి సీతారామ్

తణుకు: తణుకు నియోజవర్గంలో ఇళ్ల పట్టాల విషయంలో క్రెడిట్ చోరీ చేసి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజలని మోసం చేశారని వడ్లూరి సీతారాం ఆరోపించారు. ఈ నెల రెండో తేదీన అజ్జరం కాలనీలో 52 మంది యాచకులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టూరి బాపినీడు 2005 అక్టోబర్ 10 న ఇదే యాచకులకు పట్టాలను ఈ ఏడాది సెప్టెంబర్ 29 న తహసిల్దార్ సంతకాలతో అదే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

ఇళ్ల పట్టాల పంపిణీలో వారి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు మూడు సెంట్లు భూమి ఇస్తానని ఎన్నికల్లో హామీ చేసి ఇప్పటివరకు అర సెంటు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వడ్లూరి సీతారాం డిమాండ్ చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)