Kovur: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై నల్లపరెడ్డి కౌంటర్!
Kovur: కోవూరు నియోజకవర్గం విడవలూరులో వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై నల్లపరెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు.
Kovur: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆరోపణలపై నల్లపరెడ్డి కౌంటర్!
Kovur: కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం లోని సాయిబాబా కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు కాటంరెడ్డి నవీన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర PAC సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు.అనంతరం ఇటీవల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఆన్లైన్ ట్రేడింగ్‌లో 85 లక్షల రూపాయల మోసం చేశానన్న ఆరోపణలు సరికావని అన్నారు.తాను మోసం చేయలేదని.. తానే మోసపోయానని చెప్పారు. మస్తాన్ పేరుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా తెరిచి ఆన్లైన్ ట్రేడింగ్‌లో రూ.85 లక్షలు పెట్టి నష్టపోయానని తెలిపారు. ఇతరుల వద్ద అప్పుగా తీసుకున్న నగదుకు చెక్కులు ఇచ్చానని, ఇంకా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని చెప్పారు.
తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం సరికాదని, ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ఆరోపణలు చేయడం తగదని అన్నారు. తనపై నమోదైన తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని, కోర్టులు అన్ని అంశాలను పరిశీలిస్తాయని వ్యాఖ్యానించారు.అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యారని.. అంతమాత్రాన గర్వం, అహంకారం పనికిరాదంటూ ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
డబ్బు ఉందని విర్రవీగకుండా, వీలైతే ప్రజలకు సాయం చేయాలని హితవు పలికారు.నల్లపరెడ్డి కుటుంబం గురించి నెల్లూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని, కావాలంటే ప్రభుత్వంతో విచారణ చేయించుకోవచ్చని సవాల్ చేశారు. ప్రశాంతిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని కౌంటర్ ఇచ్చారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రసన్నకుమార్ రెడ్డి.. అనంతరం వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలకు వైసీపీ గుర్తింపు ఐడీ కార్డులను అందజేశారు.




