Iragavaram: విబీ గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి: ఇరగవరంలో కూలీల ధర్నా
Iragavaram: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కావలిపురంలో ఉపాధి హామీ కూలీలు ధర్నా చేపట్టారు.
Iragavaram: విబీ గ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలి: ఇరగవరంలో కూలీల ధర్నా
Iragavaram: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన వి బి గ్రామ్ జి పథకంతో పేదల కడుపు కొట్టొద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్ర రావు డిమాండ్ చేశారు. కూలీలకు నష్టం చేసే విబి గ్రామ్ జి పథకాన్ని తక్షణం రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇరగవరం మండలం కావలిపురం పంచాయతీ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి అనంతరం పంచాయతీ కార్యదర్శి యు. ప్రసాదరావు కి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో వామపక్షాల పోరాట ఫలితంగా పురుడు పోసుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న గాడ్సే వారసుల ప్రభుత్వం రద్దుచేసి ఆస్థానంలో విబి గ్రామ్ జి పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రంలో టీడీపీ జనసేన వైసిపి మద్దతు పలకడం దుర్మార్గమన్నారు.
దేశంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ ప్రభుత్వాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నుండి 40 శాతం పెంచిన భారాన్ని భరించలేమని మోడీకి మొర పెట్టుకుంటుంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న ఉపాధి కూలీల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి విబి గ్రామ్ జి పథకాన్ని రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సిఐటియు, సంఘ నాయకులు, రా మాంజనేయులు భావన సంజీవరావు. సికిలే శేషకుమారి. రాధాకృష్ణ వేణి. వెంకట్రావు. సుబ్బాయమ్మ తదితరులు పాల్గొన్నారు.




