Palakollu: ఆపన్నులకు అండగా వాకర్స్ క్లబ్ పాలకొల్లు: ఉచితంగా మందులు
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాకు చెందిన ఆపన్నులకు రూ.35 వేల విలువైన మందులు, పేద విద్యార్థికి సైకిల్‌ను ఉచితంగా అందజేశారు.
Palakollu: ఆపన్నులకు అండగా వాకర్స్ క్లబ్ పాలకొల్లు: ఉచితంగా మందులు
Palakollu: డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కు చెందిన పలువురు మందులు మరియు ఇతర సాయం కోసం వాకర్స్ క్లబ్ పాలకొల్లు ను సంప్రదించడం తో స్పందించిన క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు మంగళవారం క్లబ్ సభ్యుల తో కలిసి వారికి సాయం అందించారు.
ముత్యాలపాలెం కు చెందిన మేరీ కుమారి మరియు ఆమె కుమార్తె ఆశాజ్యోతి లకు 25 వేల రూపాయల మందులు, లక్కవరం గ్రామానికి చెందిన ఏడిద గంగరాజు కు 10 వేల రూపాయల మందుల తో పాటు నగరం గ్రామానికి చెందిన పేద 10వ తరగతి విద్యార్థికి 7 వేల రూపాయల విలువైన సైకిల్ ను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, నంబూరి గంగాపవన్, బోనం రాజు, మందలపు వేణు తదితరులు పాల్గొన్నారు.




