Palakollu: 'తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనం ప్రారంభించిన మంత్రి నిమ్మల!
Palakollu: పాలకొల్లు ఇమిడి సత్యనారాయణ వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి పనులను తనిఖీ చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
Palakollu: తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనం ప్రారంభించిన మంత్రి నిమ్మల!
పాలకొల్లు: పాలకొల్లులోని ఇమిడి సత్యనారాయణ వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాన్ని అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి.. నిర్మాణ పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.
పనుల్లో ఎక్కడా జాప్యం చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని మరింత పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు, సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశించిన ప్రమాణాల మేరకు పనులు చేపట్టాలని, నిర్మాణ పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధితో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అందుకు అనుగుణంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వాసుపత్రిని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈఈ విజయ్, మున్సిపల్ డి ఈ రాజకుమార్, ఆసుపత్రి సూపర్డెంట్ మాధురి, నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పొట్నూరి శ్రీనివాసరావు, బిరుదుకోట శేఖర్, చినిమిల్లి గణపతి, సురేష్ , ముప్పిరి సత్యనారాయణ, కొల్లు పవన్ తదితరులు పాల్గొన్నారు.




