Poduru: వైసీపీ పాలనలో పేదవానికి అందిన ఫలాలే విజయానికి నాంది: సరేళ్ల సౌమ్య
Poduru: ఆచంట నియోజకవర్గం పోడూరు మండలంలో మాజీ మంత్రి రంగనాథరాజు ఆశీస్సులతో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సరేళ్ల సౌమ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Poduru: వైసీపీ పాలనలో పేదవానికి అందిన ఫలాలే విజయానికి నాంది: సరేళ్ల సౌమ్య
పోడూరు: ఆచంట నియోజకవర్గం వైసీపీ మాజీమంత్రి. ఆచంట నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకువాడ శ్రీరంగనాద్ రాజు ఆశీస్సులతో పోడూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి సరేళ్ల సౌమ్య ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి మండలంలో భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
మండలంలో ఏ ఇంటికి వెళ్లిన ఆప్యాయతతో పలకరించి ఆశీర్వదించడం అభ్యర్థి సౌమ్య విజయానికి సుగమనం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అభివృద్ధి ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల పక్షాన ఉండి పేదవారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిందన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ప్రతి పేదవాడికి న్యాయం జరిగిందని, ఆ అభివృద్ధిని కొనసాగించేందుకే తాను పోటీ చేస్తున్నానని తెలిపారు.
మండలంలో సరేళ్ల సౌమ్య ప్రచారం దూసుకువెళ్తోందని, ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుండటంతో నెగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు, పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాలవారి విశ్లేషణ . ఈప్రచారంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




