Achanta: పెద్దపేట సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: నాగేశ్వరరావు!
Achanta: ఆచంట మండలం పెద్దపేటలో జనసేన నేత తుంగ నాగేశ్వరరావు పర్యటించారు. గ్రామంలో 50 మంది జనసేనలో చేరగా, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Achanta: పెద్దపేట సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా: నాగేశ్వరరావు!
ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట మండలం పెద్దపేట గ్రామంలో ఆచంట నియోజకవర్గ జనసేన నాయకుడు తుంగ నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపేట చర్చిలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని, గ్రామస్తులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో గ్రామంలో గత 30 ఏళ్లుగా కనీస మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ మహిళ తన ఆవేదనను తుంగ నాగేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు.
మహిళ సమస్యను సావధానంగా విన్న తుంగ నాగేశ్వరరావు, పెద్దపేటలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు.
మరోవైపు, జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన పెద్దపేట గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు, వీర మహిళలు తుంగ నాగేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.




