West Godavari: పెనుమంట్ర ఎస్విజి హైస్కూల్లో పీఎం శ్రీ బృందం తనిఖీలు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలోని స్థానిక ఎస్విజి హైస్కూల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ నేతృత్వంలోని పీఎం శ్రీ బృందం సందర్శించింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 15 July 2026 6:34 AM IST
West Godavari
X

West Godavari: పెనుమంట్ర ఎస్విజి హైస్కూల్లో పీఎం శ్రీ బృందం తనిఖీలు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి ఈవి వి ఎన్ ఎస్ ఎస్ బి ఎల్ నారాయణ తో కూడిన పీఎం శ్రీ బృందం సోమవారం నాడు మధ్యాహ్నం స్థానిక ఎస్విజి హై స్కూల్ ను సందర్శించింది ఈ సందర్భంగా పీఎం శ్రీ పథకంలో కీలకమైన 21 అంశాలను నిశిత పరిశీలన జరపడం జరిగింది. సైన్స్ లాబ్ ను పరిశీలించి విద్యార్థులతో ప్రత్యక్షంగా సైన్స్ ప్రయోగాలు చేయించారు.

అనంతరం ఒకేషనల్ ల్యాబ్ ను సందర్శించి వివిధ పరికరాలు గురించి విద్యార్థులను ప్రశ్నించి వారి నుండి సమాధానాలు రాబట్టారు. అనంతరం లైబ్రరీ తో పాటు మిగిలిన అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి సంభాషిస్తూ మిషన్ మార్చ్ 2027 ప్రణాళికను పూర్తిగా పాటించాలని,

100% పబ్లిక్ పరీక్షలు ఉత్తీర్ణత శాతం సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం జరిపి పలు కీలకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తో పాటు ఏ పీ ఓ నారాయణ రాజు, మండల విద్యాశాఖ అధికారి ఉంగరాల నాగేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కే నరసింహారెడ్డి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story